ద్విభాషా చిత్రం కోసం రంగంలోకి స్టార్స్!
- షూటింగు దశలో చైతూ 22వ సినిమా
- రెండోసారి చైతూ జోడీ కడుతున్న కృతి శెట్టి
- కీలకమైన పాత్రలో సంపత్ రాజ్
- వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు
నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. దర్శకుడిగా వెంకట్ ప్రభుకి ఇది 11వ సినిమా కాగా, కెరియర్ పరంగా ఇది చైతూకి 22వ సినిమా. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది.
ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం ఎంపికైన స్టార్స్ ఒక్కొక్కరుగా రంగంలోకి దిగుతున్నారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకిగాను ప్రియమణిని తీసుకున్నారు. మరో కీలకమైన పాత్ర కోసం సంపత్ రాజ్ ను తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్స్ ను వదిలారు. ఈ సినిమా షూటింగులో వారు జాయిన్ అవుతున్నారు.
చైతూ - కృతి శెట్టి 'బంగార్రాజు' హిట్ తరువాత కలిసి చేస్తున్న సినిమా ఇది. 'బంగార్రాజు' తరువాత వాళ్లు చేసిన వేరు వేరు సినిమాలు ఆశించిన స్థాయిని అందుకోలేకపోయాయి. అందువలన ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలని వాళ్లు భావిస్తున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదలవుతోంది.