చిరంజీవి కొత్త చిత్రం డబ్బింగ్ పనులు షురూ
- బాబీ దర్శకత్వంలో చిరంజీవి 154వ చిత్రం
- పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ ప్రారంభం
- చిరంజీవి సరసన కథానాయికగా శ్రుతి హాసన్
- కీలకపాత్రలో నటిస్తున్న రవితేజ
గాడ్ ఫాదర్ చిత్రం అందించిన ఘనవిజయంతో మెగాస్టార్ చిరంజీవి రెట్టించిన ఉత్సాహంతో కొత్త సినిమాలను పూర్తిచేసే పనిలో పడ్డారు. చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో కొత్త చిత్రం చేస్తున్నారు. ఇది చిరంజీవికి 154వ సినిమా. కాగా, ఈ సినిమా డబ్బింగ్ పనులు నేడు ప్రారంభం అయ్యాయి.
దర్శకుడు బాబీ, పలువురు టెక్నీషియన్ల సమక్షంలో లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, డబ్బింగ్ కార్యక్రమాలు షురూ చేశారు. చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. త్వరలోనే ఈ చిత్రం నుంచి భారీ అప్ డేట్లు వస్తాయని తెలిపింది. బహుశా అది టైటిల్ కన్ఫర్మేషన్ అయ్యుంటుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ దీపావళి నాడు వెలువడుతుందని టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ అనే రెండు టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. వీటిలో వాల్తేరు వీరయ్య అనే పేరును చిరంజీవి సూచించారు. మరి వీటిలో దేనిని చిత్రబృందం ఫిక్స్ చేస్తుందో చూడాలి.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతి హాసన్ నటిస్తుండగా, మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.