నడక తేడాగా ఉండడంతో పట్టుకున్న కస్టమ్స్ అధికారులు.. మలద్వారంలో కిలో బంగారం!
- దోహా నుంచి కొచ్చి చేరుకున్న నిందితుడు
- బంగారాన్ని నాలుగు క్యాప్సుల్స్‌లో నింపి మలద్వారంలో పెట్టుకున్న నిందితుడు
- ముంబైలో వేర్వేరు ఘటనల్లో రూ. 7.87 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
విమానంలో ఖతర్ రాజధాని దోహా నుంచి కేరళలోని కొచ్చి చేరుకున్న ఓ వ్యక్తి నడక తేడాగా ఉండడంతో విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు అనుమానించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా అతడి మలద్వారంలో కిలో బంగారం ఉన్నట్టు తేలింది. బంగారాన్ని నాలుగు క్యాప్సుల్స్‌లో నింపి తరలిస్తున్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం 1066.75 గ్రాములున్నట్టు అధికారులు తెలిపారు. నిందితుడు కోజికోడ్ జిల్లా కొడువాలి ప్రాంతానికి చెందిన అబ్దుల్ జలీల్‌గా గుర్తించారు.
మరోవైపు, మహారాష్ట్ర రాజధాని ముంబైలో వేర్వేరు ఘటనల్లో దాదాపు 15 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ. 7.87 కోట్లు ఉంటుందని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.