మ‌ఫ్టీలో ఉన్న ఐదుగురు వ్య‌క్తులు న‌న్ను గంట‌ల త‌ర‌బ‌డి కొట్టారు: దార‌ప‌నేని న‌రేంద్ర‌

  • బుధ‌వారం రాత్రి న‌రేంద్ర‌ను అదుపులోకి తీసుకున్న‌సీఐడీ
  • రాత్రంతా సీఐడీ క‌స్ట‌డీలోనే న‌రేంద్ర‌
  • దెబ్బ‌లు క‌నిపించ‌కుండా త‌న‌ను కొట్టార‌న్న న‌రేంద్ర 
  • టీడీపీ నేత‌లు, లాయ‌ర్లకు చెప్పిన వైనం
ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌య మీడియా కో ఆర్డినేట‌ర్ దార‌ప‌నేని న‌రేంద్ర గురువారం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుధవారం గుంటూరులోని త‌న నివాసంలో న‌రేంద్ర ఉండ‌గా...ఆయ‌న‌ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. బుధవారం రాత్రి త‌మ క‌స్ట‌డీలోనే ఉంచుకున్న సీఐడీ అధికారులు గురువారం మ‌ధ్యాహ్నం గుంటూరు ఆసుప‌త్రికి న‌రేంద్ర‌ను త‌ర‌లించారు. ఆసుప‌త్రిలో వైద్య చికిత్సల అనంత‌రం ఆయ‌న‌ను సీఐడీ కోర్టు న్యాయ‌మూర్తి ఎదుట ప్ర‌వేశ‌పెట్టారు.

వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆసుప‌త్రికి తీసుకొచ్చిన సంద‌ర్భంగా టీడీపీ నేత‌లు, త‌న న్యాయ‌వాదుల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగానే ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఐడీ అధికారుల క‌స్ట‌డీలో ఉన్న త‌న‌ను అర్థ‌రాత్రి నుంచి తెల్ల‌వారుజాము 5.30 గంట‌ల వ‌ర‌కు మ‌ఫ్టీలో ఉన్న ఐదుగురు వ్య‌క్తులు త‌న‌ను కొట్టార‌ని ఆయ‌న వాపోయారు. అంతేకాకుండా దెబ్బ‌లు బ‌య‌ట‌కు క‌నిపించ‌కుండా ఆ వ్య‌క్తులు త‌న‌ను కొట్టార‌ని న‌రేంద్ర ఆరోపించారు.


More Telugu News