సతీసమేతంగా రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం జగన్
- గవర్నర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసిన జగన్, వైఎస్ భారతి
- జ్ఞాపికలు ఇచ్చిపుచ్చుకున్న సీఎం జగన్, గవర్నర్
- రాజ్ భవన్ లో సమావేశం
ఏపీ సీఎం జగన్ ఈ సాయంత్రం సతీసమేతంగా రాజ్ భవన్ కు తరలి వెళ్లారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను సీఎం జగన్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ కు శాలువా కప్పి వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని జ్ఞాపికగా బహూకరించారు. గవర్నర్ కూడా సీఎం జగన్ కు శాలువా కప్పి ఓ జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులతో సీఎం జగన్, వైఎస్ భారతి సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు అంశాలు చర్చించారు.
అంతకుముందు, తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో, అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలపై సమీక్ష చేపట్టారు. వర్షాలు, వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి అధికారులు ఆసరాగా నిలవాలని స్పష్టం చేశారు.
వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఆస్తి నష్టం, పంట నష్టం అంచనాలు తయారుచేయాలని ఆదేశించారు. నిర్ణీత సమయంలోగా బాధితులకు పరిహారం అందించడంపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.