మంచి చేసే కార్యక్రమాలను కూడా రాజకీయం చేస్తుండడం దురదృష్టకరం: సీఎం జగన్

  • పాఠ‌శాల విద్య‌పై స‌మీక్ష నిర్వ‌హించిన జ‌గ‌న్‌
  • బైజూస్‌తో ఒప్పందంపై వ‌చ్చిన వ్య‌తిరేక క‌థ‌నాల‌ను ప్ర‌స్తావించిన వైనం
  • వేల రూపాయ‌ల కంటెంట్‌ను విద్యార్థుల‌కు ఉచితంగా ఇస్తున్నామ‌ని వెల్ల‌డి
పాఠ‌శాల విద్యా శాఖ‌పై స‌మీక్ష సంద‌ర్భంగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొన్ని మీడియా సంస్థ‌ల‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. పాఠ‌శాలల్లో చేప‌డుతున్న నాడు-నేడు, స్కూలు పిల్ల‌ల‌కు ట్యాబ్‌ల పంపిణీ, పిల్ల‌ల‌కు బైజూస్‌తో ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు, విద్యా కానుక కిట్ల పంపిణీ త‌దిత‌రాల‌పై జ‌గ‌న్ అధికారుల‌తో స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా బైజూస్‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందంపై కొన్ని మీడియా సంస్థల్లో వ‌చ్చిన వార్త‌ల‌ను జ‌గ‌న్ ప్ర‌స్తావించారు.

మార్కెట్‌లో వేల రూపాయ‌ల ఖ‌ర్చు అయ్యే కంటెంట్‌ను ఉచితంగా విద్యార్థుల ఫోన్ల‌లోకి డౌన్‌లోడ్ చేస్తున్నామ‌ని జ‌గ‌న్ చెప్పారు. ఇంత‌టి మంచి కార్య‌క్ర‌మంపైనా కొన్ని మీడియా సంస్థ‌లు వ‌క్రీక‌ర‌ణ‌ల‌తో క‌థ‌నాలు రాస్తున్నాయ‌ని జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విద్యా సంబంధిత కార్య‌క్ర‌మాలు, మంచి చేసే కార్య‌క్ర‌మాల‌ను కూడా రాజకీయం చేస్తుండడం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.


More Telugu News