8 రోజుల్లో 145 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన 'గాడ్ ఫాదర్'
- ఈ నెల 5వ తేదీన విడుదలైన 'గాడ్ ఫాదర్'
- తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు
- ఓవర్సీస్ లోను అదే స్థాయి రెస్పాన్స్
- మెగా హీరోల అభినందనల పట్ల మోహన్ రాజా హర్షం
చిరంజీవి - మోహన్ రాజా కాంబినేషన్లో రూపొందిన 'గాడ్ ఫాదర్' ఈ నెల 5వ తేదీన విడుదలైంది. చిరంజీవికి ఈ సినిమాలో హీరోయిన్ లేదు .. అందువలన డ్యూయెట్లు లేవు. చిరంజీవికి ఉన్నది మాస్ ఇమేజ్ .. అందువలన ఆయన ఇలాంటి సినిమా చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందా అనే టెన్షన్ అభిమానుల్లో ఉండేది. కానీ ఈ సినిమా తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకుంది.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమాకి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 8 రోజుల్లోనే ఈ సినిమా 145.24 కోట్లను వసూలు చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'ఆచార్య' సినిమా వలన కలిగిన అసంతృప్తికి 'గాడ్ ఫాదర్' సమాధానం చెబుతుందని చిరంజీవి చెప్పినట్టుగానే జరిగింది.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ లో మోహన్ రాజా మాట్లాడుతూ ... "సినిమా విడుదలైన తరువాత నాకు ఫస్టు చరణ్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఈ సినిమా గురించి ఆయన అరగంటసేపు మాట్లాడుతూ నన్ను అభినందించారు. నిజంగా అది నాకు చాలా ఆనందాన్ని కలిగించిన విషయం. ఆ తరువాత బన్నీ .. సాయిధరమ్ తేజ్ కూడా కాల్ చేసి మాట్లాడారు" అంటూ హర్షాన్ని వ్యక్తం చేశారు.