ప్రచండ తుపానుకు పడిపోయిన విశాఖను.. నుంచోబెట్టి, ఊతమిచ్చి, పరిగెత్తించింది చంద్రబాబు: టీడీపీ

  • హుద్ హుద్ తుపానుకు 8 ఏళ్లు
  • నాటి ఙ్ఞాప‌కాల‌ను గుర్తు చేసిన టీడీపీ
  • 6 నిమిషాల నిడివితో వీడియోను విడుద‌ల చేసిన వైనం
ఏపీలోని ప్ర‌ధాన న‌గ‌రం విశాఖ‌ప‌ట్నంను గ‌తంలో హుద్‌హుద్ తుఫాను అత‌లాకుత‌లం చేసిన సంగ‌తి తెలిసిందే. విశాఖ‌పై హుద్‌హుద్ విరుచుకుప‌డి నేటికి స‌రిగ్గా 8 ఏళ్లు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని విప‌క్ష టీడీపీ త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో ఓ ఆస‌క్తిక‌ర పోస్ట్‌ను పెట్టింది. 6.17 నిమిషాల నిడివి ఉన్న ఓ వీడియోను కూడా త‌న పోస్ట్‌కు జ‌త చేసింది. హుద్‌హుద్ సంద‌ర్భంగా విశాఖ‌లో నెల‌కొన్న ప‌రిస్థితులు, ఆపై విశాఖ‌ను చంద్ర‌బాబు ప‌రిశీలించ‌డం, విశాఖ పున‌ర్నిర్మాణంపై దృష్టి సారించ‌డం, ఆయా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల స్పంద‌న‌ల‌తో కూడిన ఈ వీడియోను టీడీపీ పోస్ట్ చేసింది.

ఇక ''నాడు ప్రచండ తుఫానుకు పడిపోయిన విశాఖను, నుంచోబెట్టి, ఊతమిచ్చి, పరిగెత్తించింది చంద్రబాబు గారు.. నేడు విశాఖను కబళిస్తున్న జే-బ్యాచ్ నుంచి విశాఖను కాపాడి, మళ్ళీ 'సిటీ అఫ్ డెస్టినీ' గా ప్రపంచం మొత్తం చెప్పుకునేలా చేసేది కూడా చంద్రబాబు గారే''న‌ని టీడీపీ ఓ కామెంట్‌ను పోస్ట్ చేసింది.


More Telugu News