ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో అభిషేక్‌రావుకు సీబీఐ క‌స్ట‌డీ పొడిగింపు

  • గురువారంతో ముగిసిన అభిషేక్ రావు సీబీఐ క‌స్ట‌డీ
  • మ‌రో 2 రోజుల పాటు క‌స్ట‌డీ పొడిగించాల‌న్న సీబీఐ
  • సీబీఐ వాద‌న‌కు ఒకే చెప్పిన కోర్టు
ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో నిందితుడిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బోయినప‌ల్లి అభిషేక్ రావుకు విధించిన సీబీఐ క‌స్ట‌డీ మ‌రో 2 రోజుల పాటు కొన‌సాగ‌నుంది. ఈ కేసులో సౌత్ లాబీ పేరిట అభిషేక్ రావు పెద్ద మొత్తంలో న‌గ‌దును వినియోగించార‌ని సీబీఐ ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ వివ‌రాల‌పై ఎన్నిసార్లు ప్ర‌శ్నించినా త‌మ‌కు స‌రైన స‌మాధానాలు చెప్ప‌డం లేద‌ని. ఈ కార‌ణంగానే అభిషేక్‌ను త‌మ కస్ట‌డీకి అప్ప‌గించాల‌ని సీఐడీ అధికారులు కోర్టును కోరారు. ఈ క్ర‌మంలో కోర్టు అనుమ‌తితో ఇప్ప‌టికే సీబీఐ అధికారులు అభిషేక్‌ను 3 రోజుల పాటు విచారించారు. 

కోర్టు నిర్దేశించిన గ‌డువు గురువారం పూర్తి కావ‌డంతో అభిషేక్‌ను సీబీఐ అధికారులు కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా అభిషేక్‌ను మ‌రో 2 రోజుల పాటు త‌మ క‌స్ట‌డీకి అనుమ‌తించాల‌ని కోర్టును సీబీఐ కోరింది. ఈ మేర‌కు సీబీఐ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను ప‌రిశీలించిన కోర్టు... అభిషేక్ రావును మ‌రో 2 రోజుల పాటు క‌స్ట‌డీకి అనుమ‌తించింది.


More Telugu News