ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపుపై తెలుగు రాష్ట్రాలు స‌హా కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

  • ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపు త‌ప్ప‌నిస‌రి
  • ఆ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్ట‌ని కేంద్ర ప్ర‌భుత్వం
  • కేంద్రం తీరును ప్ర‌శ్నిస్తూ దాఖ‌లైన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టులో విచార‌ణ‌
  • 8 వారాల‌కు విచార‌ణ‌ను వాయిదా వేసిన కోర్టు
ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుపై బుధ‌వారం స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్య‌ను పెంచాల్సి ఉంది. అయితే ఆ దిశ‌గా ఇప్ప‌టిదాకా కేంద్రం చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేదు. కేంద్రం తీరును నిర‌సిస్తూ ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్య‌ను పెంచేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖ‌లైన ఓ పిటిష‌న్‌పై సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది.

ఈ విచార‌ణ సంద‌ర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు కేంద్ర ప్ర‌భుత్వం, కేంద్ర ఎన్నిక‌ల సంఘాల‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్య‌వ‌హారంపై 4 వారాల్లోగా కౌంట‌ర్లు దాఖ‌లు చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంత‌రం ఈ పిటిష‌న్‌పై విచార‌ణ‌ను 8 వారాల‌కు వాయిదా వేసింది.


More Telugu News