స్విట్జర్లాండ్ నుంచి వచ్చి అమ్మ కోసం అన్వేషణ

  • 1978లో దత్తత కారణంగా ముంబై నుంచి స్విట్జర్లాండ్ వెళ్లిన ముల్లర్
  • 2011 నుంచి ముంబైకి వచ్చిపోతూ అమ్మ జాడ కోసం విచారణ
  • ఇప్పటికీ ఫలించని ప్రయత్నం
తన జన్మకు మూలమైన మాతృమూర్తిని చూడాలన్నది స్విట్జర్లాండ్ కు చెందిన 44 ఏళ్ల బీనా మఖిజానీ ముల్లర్ కోరిక. ముంబైలో ఆమె ఎక్కడుందో జాడ తెలుసుకోవాలని గత పదేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. ముల్లర్ ను 1978లో ఓ మహిళ ముంబైలో దత్తత తీసుకుని తన వెంట స్విట్జర్లాండ్ తీసుకెళ్లిపోయింది. ఆ సమయంలో ఆమెకు తన తల్లిదండ్రుల వైపు నుంచి గుర్తున్న పేరు రెబెల్లో. ఇదొక్కటే ముల్లర్ దగ్గరున్న సమాచారం. అంతకు మించి తనకు జన్మనిచ్చిన మహిళ వివరాలు లేవు.

‘‘గోనెసే ప్రాంతం నుంచి ముంబైకి వచ్చిన రెబెల్లో అనే మహిళ ఎవరికైనా తెలుసా? ఆమె నాకు 1978లో జన్మనిచ్చింది. తెలిసిన వారు ముందుకు రావాలి. నన్ను ఓ భారతీయురాలు దత్తత తీసుకున్నది. ఆమె పేరు స్టిగ్మా. నేను ఎవరి జీవితాన్నీ నాశనం చేయాలని చూడడం లేదు. కేవలం సమాధానమే కోరుకుంటున్నాను’’అని ముల్లర్ పేర్కొంది. 

1978లో ఆశా సదన్ నుంచి ముల్లర్ ను దత్తత తీసుకుని స్విట్జర్లాండ్ తీసుకెళ్లిపోగా, 2011 నుంచి ఆమె తన అసలైన అమ్మ కోసం ఎదురు చూస్తోంది. మా అమ్మను కనిపెట్టడానికి 2011 నుంచి భారత్ కు వచ్చి పోతున్నాను. కానీ నేను ఈ విషయంలో కొంచెం కూడా సక్సెస్ కాలేదు. కానీ, ఏదో ఒక రోజు తప్పకుండా నా అన్వేషణ ఫలిస్తుందన్న నమ్మకం ఉంది’’అని పేర్కొంది. ముల్లర్ కు 13, 16 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు సంతానం. వారు సైతం తల్లి అన్వేషణను ప్రోత్సహిస్తున్నారు.


More Telugu News