బైజూస్ లో పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన
- వచ్చే ఆరు నెలల్లో 2,500 మంది తొలగింపు
- 5 శాతం మేర ఉద్యోగులను తగ్గించుకుంటామని బైజూస్ ప్రకటన
- లాభాల్లోకి అడుగుపెట్టే ప్రణాళికతో ఉన్న కంపెనీ
ఎడ్యుటెక్ సంస్థ (విద్యా సేవల కంపెనీ) బైజూస్.. పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించనుంది. భారీ నష్టాలను తగ్గించుకుని, లాభాల్లోకి అడుగు పెట్టే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. 2,500 మంది ఉద్యోగులను తీసివేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం బైజూస్ లో 50,000 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. 5 శాతం మంది ఉద్యోగులను వచ్చే ఆరు నెలల్లో తగ్గించుకోనున్నట్టు తెలిపింది.
2020-21 సంవత్సరానికి రూ. 4,588 కోట్లను నష్టపోయినట్టు బైజూస్ ఇటీవలే వెల్లడించింది. దేశంలోనే అత్యంత విలువైన స్టార్టప్ ఈ స్థాయిలో నష్టాలను ప్రకటించడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. వాటాదారుల నుంచి ప్రశ్నలను సైతం బైజూస్ ఎదుర్కొన్నది. దీంతో నష్టాలను తగ్గించుకునేందుకు చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
2023 నాటికి లాభాల్లోకి ప్రవేశించే ప్రణాళికను రూపొందించినట్టు బైజూస్ సహ వ్యవస్థాపకురాలు దివ్య గోకుల్ నాథ్ ప్రకటించారు. నిర్వహణ వ్యయాలు తగ్గించడం, కార్యకలాపాల స్థిరీకరణ ప్రణాళికలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. కే10 సబ్సిడరీలు అయిన మెరిట్ నేషన్, ట్యూటర్ విస్టా, స్కాలర్, హాష్ లెర్న్ ను ఒక్కటిగా వీలీనం చేయనుంది. ఆకాశ్, గ్రేట్ లర్నింగ్ విడిగానే కొనసాగుతాయి.