పూరి కథ కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పిన మెగాస్టార్!

పూరి కథ కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పిన మెగాస్టార్!
  • ఇటీవల వచ్చిన 'గాడ్ ఫాదర్' మూవీ 
  • ప్రత్యేకమైన పాత్రను పోషించిన పూరి 
  • ఇన్ స్టా లైవ్ లో చిరూతో సంభాషణ 
  • ఆయనతో సినిమా చేయాలనుందంటూ వెల్లడి 
  • వెయిట్ చేస్తుంటానన్న మెగాస్టార్  
చిరంజీవి కథానాయకుడిగా చేసిన 'గాడ్ ఫాదర్' ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో పూరి జగన్నాథ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తారు. ఆ సీన్స్ మెగాస్టార్ కాంబినేషన్లో ఉండటం మరో విశేషం. 

ఈ సినిమా సక్సెస్ కావడంతో పూరి ఇన్ స్టా లైవ్ లో చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. ఇద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ నడిచింది. గతంలో చిరంజీవితో పూరి 'ఆటో జానీ' సినిమా చేయడానికి ప్రయత్నించాడుగానీ కుదరలేదు. ఆ విషయాన్ని గురించి ఈ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ ప్రస్తావించారు. 

'ఆటో జానీ' కథను పక్కన పెట్టేశానని, అంతకంటే బెటర్ స్క్రిప్ట్ తో త్వరలో వచ్చి కలుస్తానని చిరంజీవితో అన్నారు. అందుకు మెగాస్టార్ స్పందిస్తూ, తాను వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పారు. మొత్తం మీద పూరి రెడీ చేసే కథ గనుక చిరంజీవికి నచ్చితే, ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కడం ఖాయమనే విషయం అర్థమైపోతూనే ఉంది.


More Telugu News