పవన్ కల్యాణ్ యాత్రకు సిద్ధమవుతున్న ప్రత్యేక వాహనం.. పరిశీలించిన జనసేనాని
- వాహనాన్ని పరిశీలించి మార్పు చేర్పులపై సూచనలు చేసిన పవన్
- 15 నుంచి మూడు రోజులపాటు విశాఖలో పవన్ పర్యటన
- విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నేతలతో వరుస సమావేశాలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలోనే ఏపీలో యాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కోసం ప్రత్యేకంగా ఓ వాహనం సిద్ధమవుతోంది. పవన్ నిన్న ఆ వాహనాన్ని, అందులోని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మార్పు, చేర్పులపై సాంకేతిక నిపుణులతో పవన్ మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు. యాత్రను ఎప్పటి నుంచి ప్రారంభించేదీ త్వరలోనే వెల్లడిస్తామని జనసేన తెలిపింది. కాగా, ఎల్లుండి(15) నుంచి మూడు రోజులపాటు పవన్ విశాఖలో పర్యటించనున్నారు.
తొలి రోజు విశాఖ అర్బన్, రూరల్ పరిధిలోని నాయకులతో పార్టీ ప్రణాళికలు, అమలుపై చర్చిస్తారు. 16న విశాఖ పోర్టు కళావాణి ఆడిటోరియంలో నిర్వహించనున్న ఉత్తరాంధ్ర జిల్లాల జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి వినతి పత్రాలు స్వీకరిస్తారు. అదే రోజు సాయంత్రం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. 17న బీచ్‌రోడ్డులోని వైఎంసీఏ హాలులో ఉమ్మడి విజయనగరం జిల్లా నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో పవన్ సమావేశమవుతారు.