వైట్ షుగర్ బదులు.. బ్రౌన్ షుగర్ ఆరోగ్యానికి మంచి ఆప్షన్!

  • వైట్ షుగర్, బ్రౌన్ షుగర్ మధ్య పోషకాల పరంగా కొంత వ్యత్యాసం
  • మొలాసిస్ వల్ల బ్రౌన్ షుగర్ కు ఆ రంగు
  • వైట్, బ్రౌన్ షుగర్ ఏదీ అధికంగా తీసుకోకూడదు
బ్రౌన్ షుగర్ పట్ల ఇటీవలి కాలంలో ప్రచారం పెరిగింది. వైట్ షుగర్ మాదిరే దీన్ని కూడా చెరకు నుంచే చేస్తారు. మొలాసిస్ వల్ల బ్రౌన్ షుగర్ రంగు భిన్నంగా, బెల్లం మాదిరి కనిపిస్తుంది. బ్రౌన్ షుగర్ లో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. వైట్ షుగర్ తో పోలిస్తే ఇది ఆరోగ్యానికి మంచిది. 

చర్మ సౌందర్య ఉత్పత్తుల్లోనూ బ్రౌన్ షుగర్ ను వినియోగిస్తుంటారు. సాధారణ వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ కొంచమే నయం. తెల్లటి పంచదార కంటే బ్రౌన్ షుగర్ లో కేలరీలు కొంచెం తక్కువ. వైట్ షుగర్ కు బదులు బ్రౌన్ షుగర్ తీసుకోవచ్చు.

నెలసరి నొప్పి
స్త్రీలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పికి బ్రౌన్ షుగర్ ఉపశమనాన్నిస్తుంది. ఇందులో ఉండే పొటాషియం నొప్పిని తగ్గిస్తుంది. కనుక బ్రౌన్ షుగర్ ను వినియోగించుకోవచ్చు.

బరువు తగ్గొచ్చు..
ముందు చెప్పుకున్నట్టు బ్రౌన్ షుగర్ తో బరువు పెరిగే అవకాశం ఉండదు. కేలరీలు తక్కువగా ఉండే దీని వినియోగంతో బరువు తగ్గొచ్చు. మెటబాలిజాన్ని ప్రేరేపిస్తుంది. కడుపు నిండిన భావన ఉంటుంది. కనుక బరువు తగ్గేందుకు ఇది సాయపడుతుంది.

జీర్ణక్రియలు
బ్రౌన్ షుగర్ లో ఉండే మొలాసిస్ జీర్ణాశయానికి మంచిది. కడుపు ఉబ్బరం లేదా మలబద్ధకం ఉంటే గోరువెచ్చని నీరు తాగాలి. ఈ నీటికి అల్లం, బ్రౌన్ షుగర్ కలిపి తీసుకుంటే జీర్ణానికి మంచిది.

ప్రెగ్నెన్సీ నొప్పులు
గర్భధారణ కాలంలో నొప్పులు వస్తుంటాయి. ఈ నొప్పుల నుంచి బ్రౌన్ షుగర్ ఉపశమనం ఇస్తుంది. ప్రసవం తర్వాత నొప్పుల సమయంలోనూ దీనివల్ల ఉపశమనం ఉంటుంది. 

వ్యత్యాసం..
బ్రౌన్ షుగర్ లోనూ రిఫైన్ చేయనిదే మంచిది. కొందరు తయారీదారులు బ్రౌన్ షుగర్ ను రిఫైన్డ్ చేసి, దానికి తిరిగి మొలాసిస్ ను కలుపుతున్నారు. వైట్ షుగర్ అన్నది ప్యూరిఫై పూర్తి చేసుకున్నది. ఈ శుద్ధి ప్రక్రియలో భాగంగా మొలాసిస్ ను తొలగిస్తారు. కెమికల్ ప్రాసెస్ చేయడం వల్ల తెల్లగా మారుతుంది.

వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ లో మినరల్స్ ఎక్కువ. బ్రౌన్ షుగర్ లో క్యాల్షియం ఎక్కువ. తీపి తక్కువ. కాకపోతే ఈ రెండూ కూడా చక్కెరలే. కనుక నేటి జీవన విధానంలో వీటి వాడకాన్ని చాలా వరకు తగ్గించుకోవడమే ఆరోగ్యానికి మంచిది. అమెరికన్ డైటరీ గైడ్ లైన్స్ ప్రకారం.. రోజువారీ కావాల్సిన మొత్తం కేలరీల్లో యాడెడ్ షుగర్ రూపంలో వచ్చే వాటిని 10 శాతానికి పరిమితం చేసుకోవాలి.


More Telugu News