ఎక్కడ విన్నా 'కాంతార' గురించిన చర్చనే .. తెలుగులో పెరుగుతున్న అంచనాలు!
- కన్నడలో క్రితం నెల 30న విడుదలైన 'కాంతార'
- అడవి నేపథ్యంలో నడిచే ఆసక్తికరమైన కథ
- కన్నడలో రికార్డుస్థాయి వసూళ్లు
- ఈ నెల 15వ తేదీన తెలుగులో రిలీజ్
'కాంతార' .. కన్నడలో ఇప్పుడు వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేశారు. 11 రోజుల్లో ఈ సినిమా అక్కడ 58 కోట్లను వసూలు చేసింది. దాంతో ఈ సినిమాను గురించి ఇతర ఇండస్ట్రీలకు చెందిన వాళ్లంతా మాట్లాడుకుంటున్నారు. అంతగా ఈ సినిమాలో ఏవుందనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు గీతా ఆర్ట్స్ వారు తీసుకుని వస్తుండటంతో కంటెంట్ పై మరింత నమ్మకం ఏర్పడింది.
కన్నడలో దర్శకుడిగా .. హీరోగా రిషబ్ శెట్టికి మంచి పేరు ఉంది. నటుడిగా ఓ డజను సినిమాలు చేసిన ఆయన, దర్శకుడిగా ఓ అరడజను సినిమాలు చేశాడు. 'కాంతార' మాత్రం అయన కెరియర్లోనే పెద్ద ప్రాజెక్టుగా చెప్పుకోవాలి. ఎందుకంటే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను 'హోంబలే ఫిలిమ్స్' వారు నిర్మించారు. రచన - దర్శకత్వం రిషబ్ శెట్టినే. దాంతో రచయితగా .. దర్శకుడిగా .. హీరోగా కూడా ఈ సినిమాతో ఆయన నెక్స్ట్ లెవెల్ కి వెళ్లినట్టుగా చెబుతున్నారు.
ఇది అడవి నేపథ్యంలో నడిచే కథ. అక్కడి వాతావరణం .. సంప్రదాయాలు .. దైవత్వంతో ముడిపడిన కథ. అలాంటి ఈ కథకు ఇప్పుడు జనాలు నీరాజనాలు పడుతున్నారు. అజనీష్ లోకనాథ్ నేపథ్య సంగీతం .. అరవింద్ కశ్యప్ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయని అంటున్నారు. అలాంటి ఈ సినిమా ఈ నెల 15వ తేదీన ఇక్కడి థియేటర్లను పలకరించనుంది. 'కేజీఎఫ్ 2' తరువాత అదే బ్యానర్లో వస్తున్న ఈ సినిమా, టాలీవుడ్ లో ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందనేది చూడాలి.