నాసా ‘డార్ట్’ ప్రయోగం విజయవంతం.. మారిన గ్రహశకలం కక్ష్య

  • గత నెల 26న డైమార్ఫస్‌ గ్రహశకలాన్ని ఢీకొట్టిన డార్ట్
  • డైమార్ఫస్ పరిభ్రమణ కక్ష్యలో 32 నిమిషాలపాటు మార్పులు
  • కీలక ముందడుగు అన్న నాసా
భూమి వైపుగా దూసుకొచ్చే గ్రహశకలాలను దారి మళ్లించడమే లక్ష్యంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) ప్రయోగం విజయవంతమైంది. గత నెల 26న డార్ట్ వ్యోమనౌక డౌమార్ఫస్ అనే గ్రహశకలాన్ని ఢీకొట్టింది. దీంతో అది తన కక్ష్యను మార్చుకున్నట్టు నాసా తాజాగా ప్రకటించింది. 

ఈ ప్రయోగం కారణంగా డైమార్ఫస్ పరిభ్రమణ కక్ష్యలో దాదాపు 32 నిమిషాలపాటు మార్పు చోటుచేసుకున్నట్టు నాసా తెలిపింది. గ్రహశకలాల రూపంలో భవిష్యత్తులో భూమికి ఎలాంటి ముప్పు ముంచుకొచ్చినా సమర్థంగా ఎదుర్కోగల సామర్థ్యాలను సముపార్జించుకోవడంలో ఇది కీలక ముందడుగు అని నాసా ఈ సందర్భంగా పేర్కొంది.


More Telugu News