ఆట మధ్యలో మైదానంలో వచ్చిన వీధి కుక్క... సంజ్ఞలతోనే బయటకు పంపిన అయ్యర్
- ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్
- దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తుండగా మైదానంలోకి వచ్చిన కుక్క
- శ్రేయాస్ సంజ్ఞలను పాటిస్తూ బయటకు వెళ్లిన వైనం
దక్షిణాఫ్రికాతో టీమిండియా ఆడిన మూడో వన్డే సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగతున్న ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మైదానంలోకి ఓ వీధి కుక్క ప్రవేశించింది. అయితే ఆ కుక్కను టీమిండియా ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ చాకచక్యంగా బయటకు పంపేశాడు. గ్రౌండ్‌లోకి వచ్చిన కుక్క వద్దకు వెళ్లిన అయ్యర్... దానికి చేతులతో సంజ్ఞలు చేస్తూ సాగాడు. అయ్యర్ సంజ్ఞలను అనుసరించిన ఆ కుక్క ఎట్టకేలకు గ్రౌండ్ వీడి బయటకు వెళ్లిపోయింది.
మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ స్టేడియం స్టాండ్స్‌లో నుంచి లేచి నిలబడి మరీ ఈ ఘటనను వీక్షించారు. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును తొలుత బౌలింగ్‌తో చిత్తు చేసిన టీమిండియా ఆ తర్వాత బ్యాటింగ్‌లో మెరుపులు ప్రదర్శిస్తూ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వెరసి టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌ను కూడా టీమిండియా గెలిచింది.