ఈ కారు 100 శాతం ఇథ‌నాల్‌తో న‌డుస్తుంది!... ఢిల్లీలో ఆవిష్క‌రించిన కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ!

  • బ్రెజిల్ నుంచి క‌రోల్లా అల్టిస్‌ను తెచ్చిన ట‌యోటా
  • పెట్రోల్‌, ఇథ‌నాల్‌ల‌తో పాటు విద్యుత్‌తోనూ న‌డ‌వ‌నున్న కారు
  • కాలుష్య కార‌కాల‌ను త‌గ్గించే దిశ‌గా కేంద్రం చ‌ర్య‌లు
దేశంలో వాహ‌న కాలుష్యాన్ని త‌గ్గించే దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌ల్లో భాగంగా మంగ‌ళ‌వారం మ‌రో కీల‌క అడుగు ప‌డింది. 100 శాతం ఇథ‌నాల్‌తో న‌డిచే కారును కేంద్ర ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ఢిల్లీలో ఆవిష్క‌రించారు. క‌రోల్లా అల్టిస్ పేరిట‌ ట‌యోటా కంపెనీ రూపొందించిన ఈ కారును బ్రెజిల్ నుంచి ఆ సంస్థ భారత్‌కు తీసుకువ‌చ్చింది. ఈ తరహా ఇథనాల్ ఆధారిత కార్లను టయోటా సంస్థ బ్రెజిల్ లో ఇప్పటికే విక్రయిస్తోంది. 

ఫ్లెక్సీ ఫ్యూయ‌ల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎల‌క్ట్రిక్ వెహికిల్ (ఎఫ్ఎఫ్‌వీ-ఎస్‌హెచ్ఈవీ) ర‌కానికి చెందిన సాంకేతిక‌త‌ను బ్రెజిల్‌లో టయోటా అభివృద్ధి చేసింది. ఈ కారును 100 శాతం పెట్రోల్‌, 20 నుంచి 100 శాతం బ్లెండెడ్‌ ఇథ‌నాల్‌తో పాటు విద్యుత్‌తోనూ న‌డిపే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం దేశంలో కాలుష్యాన్ని త‌గ్గించే దిశ‌గా చేప‌ట్టిన చ‌ర్య‌ల్లో భాగంగా 10 శాతం ఇథ‌నాల్‌ను క‌లిపిన పెట్రోల్‌ను వాడుతున్నారు. 2025 నాటికి 20 శాతం ఇథ‌నాల్‌ను క‌లిపిన పెట్రోల్‌ను వాడే దిశ‌గా కేంద్రం చ‌ర్య‌లు చేప‌డుతోంది.


More Telugu News