మ‌రో రూ.500 కోట్ల ఆప్పు చేసిన ఏపీ స‌ర్కారు!

  • ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొన్న ఏపీ
  • 18 ఏళ్ల కాలానికి 7.85 శాతం వ‌డ్డీకి రుణం సేక‌ర‌ణ‌
  • ఈ ఏడాదిలో ఏపీ అప్పులు రూ.52,108 కోట్లకు చేరిన వైనం
ప్ర‌తి మంగ‌ళ‌వారం రిజ‌ర్వ్ బ్యాంకులో జ‌రిగే సెక్యూరిటీ బాండ్ల వేలానికి హాజ‌రవుతూ రుణాలు సేకరిస్తున్న ఏపీ స‌ర్కారు... ఈ మంగ‌ళ‌వారం కూడా సెక్యూరిటీ బాండ్ల వేలానికి హాజ‌రైంది. ఈ ద‌ఫా రూ.500 కోట్ల రుణాన్ని ఏపీ ప్ర‌భుత్వం సేక‌రించింది. 18 ఏళ్ల కాలానికి 7.85 శాతం వ‌డ్డీకి రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ రుణాన్ని సేక‌రించింది. తాజా రుణంతో ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.52,108 కోట్ల రుణం తీసుకున్న‌ట్లైంది. కేంద్రం నిర్దేశించిన ఎఫ్ఆర్‌బీఎం ప‌రిధిని ఇప్ప‌టికే దాటేసిన ఏపీ... తాజాగా మ‌రింత రుణం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.


More Telugu News