అప్పుడు మాత్రం నాన్న కన్నీళ్లు పెట్టుకున్నాడు: అల్లు అరవింద్
- తాజా ఇంటర్వ్యూలో అల్లు అరవింద్
- మొదటి నుంచి నాన్నకు నాటకాలు అలవాటు అంటూ వెల్లడి
- మద్రాసులో తండ్రి పడిన కష్టాల గురించిన ప్రస్తావన
- అందువల్లనే నటన వైపు వెళ్లలేదంటూ స్పష్టీకరణ
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అరవింద్, అల్లు రామలింగయ్యకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "చిన్నప్పటి నుంచి నాన్నగారికి నాటకాల పిచ్చి ఎక్కువగా ఉండేది. తెనాలిలో ఆయన ఒక నాటకం వేస్తుండగా, ప్రముఖ దర్శకుడు గరికపాటి రాజారావు చూశారు. ఆయన తీయబోయే సినిమాలో నాన్నగారికి ఒక వేషం ఇస్తున్నట్టుగా చెప్పారు. ఆయన నుంచి లెటర్ రాగానే నాన్న మద్రాసు వెళ్లిపోయారు.
ఆ సినిమా తరువాత వెంటనే అవకాశాలు రాక ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. అక్కడ ఎవరూ తెలియదు .. ఏమీ తెలియదు. ఒకసారి ఒక సినిమా కోసం ఆయన 10 టేకులు తీసుకున్నారట. దాంతో డైరెక్టర్ తన చేతిలో ఉన్నదేదో విసిరికొట్టి, "ఎక్కడి నుంచి వస్తారయ్యా యాక్ట్ చేద్దామని .. ఛ ఛ" అని చెప్పేసి విసుక్కున్నాడట. ఆ విషయాన్ని అమ్మతో చెప్పి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ప్రిపేర్ కాకముందే టేక్ అనేశారంటూ బాధపడ్డారు.
నాన్నగారు అలా కన్నీళ్లు పెట్టుకోవడం నాలో బాగా పాతుకుపోయింది. నేను యాక్టింగ్ వైపు వెళ్లకపోవడానికి అది కూడా ఒక కారణం కావొచ్చునేమో. అప్పట్లో ఆయన అలాంటి పరిస్థితులను తట్టుకుంటూ రిస్క్ చేయడం వలన, ఈ రోజున ఇంతమంది ఈ ప్రొఫెషన్ లో సెటిల్ అయ్యారు" అంటూ చెప్పుకొచ్చారు.