మా ఆవిడ ఎక్కువ ప్రశ్నించదు .. ఎక్కువ హింసించదు: అల్లు అరవింద్
- అగ్ర నిర్మాతల జాబితాలో అల్లు అరవింద్
- తాజా ఇంటర్వ్యూలో అనేక విషయాల ప్రస్తావన
- తన శ్రీమతి మంచిదంటూ కితాబు
- ఆడపిల్లలు లేని లోటును మేనకోడళ్లు తీర్చారంటూ హర్షం
టాలీవుడ్ అగ్ర నిర్మాతగా అల్లు అరవింద్ అందరికీ తెలుసు. తిరుగులేని హాస్యకథానాయకుడిగా అల్లు రామలింగయ్య కొనసాగితే, ఆయన వారసుడిగా అల్లు అరవింద్ సినిమా నిర్మాణ రంగం వైపు వెళ్లి అక్కడ ఎదురులేకుండా ఎదిగారు. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొని, తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. అలాగే అల్లు రామలింగయ్యకి సంబంధించిన విషయాలను గుర్తుచేసుకున్నారు.
" నా భార్య నిర్మల విషయానికి వస్తే చిదానందం .. ఎవర్ హ్యాపీ .. సింపుల్ .. నో నాన్సెన్స్. ఏవండీ ఇంత లేటుగా వచ్చారేంటి అనేది లేదు .. మధ్యాహ్నం భోజనానికి రాలేదనే తగవు లేదు. మధ్యాహ్నం భోజనం సమయానికి కాల్ చేసి ఆ విషయాన్ని గుర్తుచేస్తుంది. నేను ఫలానా చోటున ఉన్నాను .. అక్కడే చేస్తాను అని చెబితే ఓకే అంటుంది. ఇవన్నీ మా అమ్మగారిని చూసి నేర్చుకుందా అని అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ ప్రశ్నించదు .. ఎక్కువ హింసించదు.
నేను ఇంటికి ఆలస్యంగా వెళితే ... తాను అప్పటికే పడుకుంటుంది. నేను వచ్చినట్టుగా రిజిస్టర్ చేస్తాను. అలాగే అని చెప్పేసి అంటుంది. ఎన్నింటికి వచ్చాడు అని చెప్పేసి టైమ్ ఏమీ చూడదు .. పాపం .. మంచిది. నాకు ముగ్గురు మగ పిల్లలు .. ఆడపిల్లలు లేరనే బాధ ఉంది. కానీ ఆ లోటును నా నలుగురు మేనకోడళ్లు తీర్చారు" అంటూ చెప్పుకొచ్చారు.