చక్కని గుండె ఆరోగ్యానికి ఆయుర్వేద పరిష్కారాలు
- పసుపు, ఆమ్ల, ఫెనుగ్రీక్ తో మంచి ఫలితాలు
- వైట్ షుగర్ కు దూరంగా ఉండాలి
- ముందుగానే డిన్నర్.. మంచి నిద్రతోనూ ఫలితాలు
మారుతున్న కాలానికి అనుగుణంగా జీవనశైలి వ్యాధుల బారిన పడే వారు పెరిగిపోతున్నారు. కనుక ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ రిస్క్ తగ్గించుకోవచ్చు. ఇష్టానుసారం తినడమే అనారోగ్యానికి కారణమని ఆయుర్వేదం చెబుతోంది. అధిక కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో నష్టం కలిగిస్తుంది. జీవక్రియలకు కష్టంగా మారి, గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆచరించాల్సిన విధానాలను పరిశీలిస్తే..
ఆయుర్వేద మందులు
గుండె ఆరోగ్యానికి మేలు చేసే మంచి మూలికలు ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. టర్మరిక్ (పసుపు), ఆమ్ల (ఉసిరి), ఫెనుగ్రీక్ (మెంతులు) ఇవన్నీ మంచి చేస్తాయి. ఉసిరి పొడి, పసుపును ఒకే పరిమాణంలో నిత్యం తీసుకుంటే ఎన్నో మంచి ఫలితాలు కనిపిస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గడమే కాకుండా, నియంత్రణలో ఉంటుంది. ఆమ్ల, జామూన్ (నేరేడు), కరేలా కలిపి చేసే జ్యూస్ లను తీసుకున్నా గుండె జబ్బుల రిస్క్ తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు.
వ్యాయామం
ఆయుర్వేదం కూడా ఆరోగ్యం కోసం రోజువారీ వ్యాయామాన్ని సూచిస్తోంది. దీనివల్ల గుండె ఆరోగ్యం చక్కగా ఉంటుందని సూచిస్తోంది. జిమ్, యోగ, ప్రాణాయామం ఏది చేసినా జీవక్రియలు మెరుగు పడతాయి. పాంక్రియాస్ చక్కగా పనిచేస్తుంది.
వైట్ షుగర్ కు దూరం
మనం నిత్య జీవితంలో తీసుకునే చక్కెర (వైట్ షుగర్) ఆరోగ్యానికి హానికరమే అని చెప్పుకోవాలి. చక్కెరలో ఎలాంటి పోషకాలు ఉండవు. కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే లభిస్తాయి. దీనికి బదులు సహజ తీపి పదార్థాలైన పండ్లు, బెల్లం లేదా తేనె వాడుకోవచ్చు. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే క్యాబేజీ, క్యాలిఫ్లవర్, బ్రొక్కోలీ, అవకాడో, తోటకూర తీసుకోవడం మంచి చేస్తుంది.
ముందుగానే డిన్నర్
ఆయుర్వేదం ఫుడ్ ను ఆహారమని, జీవనశైలిని విహారమని చెబుతోంది. గుండె ఆరోగ్యంపై వీటి ప్రభావం ఉంటుందట. ఆహారాన్ని నిర్ణీత విరామం తర్వాతే తీసుకోవాలని చెబుతోంది. కనీసం మూడు గంటల విరామంతోనే తినాలి. నిద్రకూ ప్రాధాన్యం ఇవ్వాలి. కనీసం 7 గంటల పాటు మంచి నిద్ర కావాలి. ఆందోళన, ఒత్తిళ్లకు మంచి నిద్ర పరిష్కారం.