దీపావళికి ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ నూ అనుమతించేది లేదన్న సుప్రీంకోర్టు

  • బాణాసంచాపై నిషేధాన్ని తొలగించేది లేదని స్పష్టీకరణ 
  • నిషేధాన్ని సవాల్ చేస్తూ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ పిటిషన్
  • ఢిల్లీలో నిషేధం కొనసాగుతుందన్న ధర్మాసనం
ఢిల్లీలో బాణాసంచాపై నిషేధాన్ని ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జాతీయ రాజధాని ప్రాంతంలో బాణాసంచాపై నిషేధాన్ని ఎత్తివేయబోమని, తమ ఉత్తర్వు చాలా స్పష్టంగా ఉందని కోర్టు పేర్కొంది. పండుగ సీజన్లలో పటాకుల అమ్మకాలు, కొనుగోలు, వినియోగంపై నిషేధాన్ని సవాలు చేస్తూ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఢిల్లీ రాజధాని ప్రాంతంలో పెరుగుతున్న కాలుష్య స్థాయిలపై ఆందోళన వ్యక్తం చేసింది.  దీనిపై వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేసింది. 

‘గ్రీన్ క్రాకర్స్ అయినప్పటికీ వాటిని ఎలా అనుమతిస్తాం? ఢిల్లీ కాలుష్యం చూశారా?’ అని పిటిషనర్‌ను సుప్రీంకోర్టు  ప్రశ్నించింది. దీపావళి తర్వాత ఢిల్లీ ఎన్‌సిఆర్‌ సెక్టార్ లో గాలి నాణ్యత మరింత క్షీణిస్తుందని, పరిస్థితులు మరింత దారుణంగా మారుతామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గ్రీన్ క్రాకర్స్ వాడకాన్ని కూడా పరిమితం చేయాలని బెంచ్ పేర్కొంది. దీపావళి, ఛత్ పూజ, గురునానక్ జయంతి, నూతన సంవత్సరానికి ఢిల్లీలో పటాకుల నిషేధం కొనసాగుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.


More Telugu News