వికేంద్రీకరణకు మద్దతుగా ఈ నెల 15న విశాఖ గర్జన: మంత్రి బొత్స సత్యనారాయణ
- విశాఖలోని అంబేద్కర్ విగ్రహం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ అన్న బొత్స
- ఈ ర్యాలీకి మద్దతుగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ర్యాలీలు చేపట్టాలని పిలుపు
- అమరావతి రైతుల యాత్రను టీడీపీ యాత్రగా చెప్పిన మంత్రి
వికేంద్రీకరణకు మద్దతుగా ఈ నెల 15న విశాఖ గర్జన పేరిట ఓ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. విశాఖ గర్జనలో భాగంగా నగరంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ ర్యాలీకి మద్దతుగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రను బొత్స సత్యనారాయణ టీడీపీ యాత్రగా అభివర్ణించారు. అమరావతి రైతుల యాత్రను దోపిడీదారులు, అవినీతిపరుల యాత్ర అని ఆయన విమర్శించారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తే వచ్చే నష్టమేమిటని ఆయన ప్రశ్నించారు. విశాఖలో అభివృద్ధి అంతా వైఎస్సార్ హయాంలో జరిగినదేనని బొత్స చెప్పారు.