లోన్ యాప్ లపై ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబరు తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం
- ఇటీవల లోన్ యాప్ ల ఆగడాలు
- బెదిరింపు కాల్స్ తో బేజారు
- పలువురు ఆత్మహత్య
- 1930 నెంబరు తీసుకువచ్చిన ఏపీ సర్కారు
- బెదిరింపు కాల్స్ వస్తే ఫిర్యాదు చేయాలని సూచన
ఇటీవలకాలంలో లోన్ యాప్ ల నిర్వాహకుల బెదిరింపులతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడడం తెలిసిందే. లోన్ తీసుకుని చెల్లించికపోతే, వారి ఫోన్ లోని కాంటాక్టు లిస్టులో ఉన్నవారందరికీ సందేశాలు పంపడం, ఫొటోలను మార్ఫింగ్ చేసి ప్రచారం చేయడం వంటి ఆగడాలతో లోన్ యాప్ లు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నట్టు కథనాలు వచ్చాయి.
దీనిపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. లోన్ యాప్ లపై ఫిర్యాదుల కోసం కొత్తగా టోల్ ఫ్రీ నెంబరు తీసుకువచ్చింది. లోన్ యాప్స్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం సూచించింది.
బ్యాంకు ఖాతాల వివరాలు, పిన్ నెంబరు, ఆధార్, ఓటీపీ వివరాలను, ఫొటోలను తెలియని వ్యక్తులకు ఇవ్వొద్దని సూచించింది. ఈ మేరకు ఏపీ హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది.