కారు గుర్తును పోలిన 8 గుర్తులను తొలగించండి... తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారికి టీఆర్ఎస్ వినతి
- ఫ్రీ సింబల్స్ జాబితాలో కారును పోలిన 8 గుర్తులు
- వాటి కారణంగా తమకు నష్టం కలుగుతోందంటున్న టీఆర్ఎస్ నేతలు
- ఆ గుర్తులను తొలగించాలంటూ వికాస్ రాజ్‌కు వినతి పత్రం
మునుగోడు ఉప ఎన్నికల్లో పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్ సోమవారం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌ను కలిసింది. ఎన్నికల్లో టీఆర్ఎస్ గుర్తు కారును పోలిన గుర్తులు 8 ఉన్నాయని, వాటిని ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని కోరింది. ఈ మేరకు సోమవారం టీఆర్ఎస్ ప్రతినిధి బృందం వికాస్ రాజ్‌కు ఓ వినతి పత్రాన్ని సమర్పించింది.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ కారును పోలిన గుర్తులను ఇతర అభ్యర్థులకు కేటాయిస్తుండటంతో తమ పార్టీని నష్టం జరుగుతోందని తెలిపారు. గతంలో ఇలాగే కారును పోలిన గుర్తుల కారణంగా టీఆర్ఎస్‌కు ఓటు వేయాలనుకున్న వారు కూడా ఆ గుర్తులకు ఓటేశారని, ఫలితంగా తమ పార్టీ ఖాతాలో పడాల్సిన ఓట్లు... కారును పోలిన గుర్తు కలిగిన అభ్యర్థులకు వెళ్లిపోయాయని చెప్పారు. ఈ తరహా పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేలా కారును పోలిస గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని ఎన్నికల కమిషన్‌ను కోరామని తెలిపారు.