ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన టీ కాంగ్రెస్ నేత సుద‌ర్శ‌న్ రెడ్డి

  • నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో టీ కాంగ్రెస్ నేత‌ల‌కు ఈడీ నోటీసులు
  • ఇదివ‌ర‌కే విచార‌ణ‌కు హాజ‌రైన మాజీ మంత్రి గీతారెడ్డి
  • యంగ్ ఇండియాకు విరాళాల‌పై సుద‌ర్శ‌న్ రెడ్డిని ప్ర‌శ్నించిన ఈడీ
కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టిన నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ‌కు చెందిన ఆ పార్టీ నేత‌, మాజీ మంత్రి సుద‌ర్శ‌న్ రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైకెర్ట‌రేట్ సోమ‌వారం విచారించింది. ఈ కేసులో ప్ర‌మేయం ఉందంటూ తెలంగాణ‌కు చెందిన ప‌లువురు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌కు ఇదివ‌ర‌కే ఈడీ నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నోటీసుల‌కు అనుగుణంగా మాజీ మంత్రి గీతారెడ్డి ఇటీవ‌లే ఈడీ విచార‌ణ‌కు హాజరయ్యారు. నోటీసులు అందుకున్నవారిలో సుదర్శన్ రెడ్డి కూడా ఉన్నారు.

నోటీసుల‌కు అనుగుణంగా సుద‌ర్శ‌న్ రెడ్డి సోమ‌వారం ఢిల్లీలోని ఈడీ ప్ర‌ధాన కార్యాల‌యంలో విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఉద‌యం 11 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల దాకా సుద‌ర్శ‌న్ రెడ్డిని ఈడీ అధికారులు ప్ర‌శ్నించారు. యంగ్ ఇండియా సంస్థ‌కు విరాళాలు అందించిన కార‌ణంపై సుద‌ర్శ‌న్ రెడ్డిని ఈడీ అధికారులు ప్ర‌శ్నించిన‌ట్లు స‌మాచారం.


More Telugu News