ఇంటర్నేషనల్ క్రికెట్‌లో టీమిండియా అరుదైన రికార్డు
- వన్డే ఫార్మాట్‌లో అత్యధిక విజయాలతో సాగుతున్న టీమిండియా
- నిన్నటి దక్షిణాఫ్రికాతో గెలుపుతో 300వ విజయం నమోదు
- రెండు, మూడు స్థానాల్లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్
భారత క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో... ప్రత్యేకించి వన్డే క్రికెట్‌లో మరే ఇతర జట్టుకు అందనంత ఎత్తులో నిలిచింది. అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌లో 300 విజయాలను సాధించిన జట్టుగా టీమిండియాకు అరుదైన గుర్తింపు లభించింది. ఇప్పటికే ఈ ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా గుర్తింపు పొందిన టీమిండియా... ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో విజయంతో '300' విక్టరీ మార్కును అందుకుంది.
ఈ ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా టీమిండియా కొనసాగుతుండగా... 257 విజయాలతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో, 247 విజయాలతో వెస్టిండీస్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. సమీప భవిష్యత్తులో టీమిండియా రికార్డును బద్దలు కొట్టడం దాదాపుగా ఏ జట్టుకూ సాధ్యం కాదనే చెప్పాలి. అంతేకాకుండా ఈ విషయంలో కనీసం టీమిండియాకు చేరువ కావడం కూడా ఆయా దేశాల జట్లకు అసాధ్యమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.