రేపు ములాయం అంత్యక్రియలు... హాజరుకానున్న తెలంగాణ సీఎం కేసీఆర్
- ములాయం అస్తమయం
- రేపు స్వస్థలం సైఫాయ్ లో అంత్యక్రియలు
- నివాళులు అర్పించనున్న కేసీఆర్
సీనియర్ రాజకీయవేత్త, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ (82) అంత్యక్రియలు రేపు ఆయన స్వస్థలం సైఫాయ్ లో నిర్వహించనున్నారు. ములాయం అంత్యక్రియలకు ప్రముఖ నేతలు హాజరుకానున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ములాయం అంత్యక్రియలకు తరలి వెళ్లనున్నారు. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు.
అంతకుముందు, ములాయం మరణం పట్ల కేసీఆర్ స్పందించారు. ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ములాయం దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం యూపీకి మూడుసార్లు సీఎంగా పనిచేశారని, కేంద్రమంత్రిగానూ పనిచేశారని వెల్లడించారు.
సోషలిస్టు నేత రామ్ మనోహర్ లోహియా, స్వాతంత్ర సమరయోధుడు రాజ్ నారాయణ్ వంటి గొప్పనేతల స్ఫూర్తితో ములాయం రాజకీయాల్లోకి వచ్చారని, తన జీవితకాలం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడ్డారని కేసీఆర్ కొనియాడారు.