ములాయం మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఏపీ సీఎం జగన్
- తీవ్ర అనారోగ్యంతో ములాయం కన్నుమూత
- సంతాపం తెలియజేసిన ఏపీ సీఎం జగన్
- ములాయం నిజమైన రాజనీతిజ్ఞుడని వెల్లడి
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల ఏపీ సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ములాయం కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
ములాయం నిజమైన రాజనీతిజ్ఞుడని కీర్తించారు. ఎల్లవేళలా అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసిన ములాయం భారత్ లో సోషలిస్టు నాయకత్వానికి ప్రతీకలా నిలిచిపోతాడని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
కాగా, ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు రేపు సైఫాయ్ లో నిర్వహించనున్నారు. ఈ సీనియర్ రాజకీయవేత్త మరణం పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.