ములాయం ఆరోగ్య పరిస్థితి మరింత విషమం
- గురుగ్రామ్ మేదాంత ఆసుపత్రిలో ములాయం
- ఐసీయూలో ప్రాణాధార ఔషధాలతో చికిత్స
- ఆగస్టు 22 నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధనేత
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ (82) ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో ములాయంకు ఐసీయూలో చికిత్స జరుగుతోంది.
ఆయనకు ప్రాణాధార ఔషధాలు వాడుతున్నామని డాక్టర్లు తెలిపారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతున్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ములాయం ఆగస్టు 22 నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూకి తరలించారు.
కాగా, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ సాయంత్రం ములాయం తనయుడు అఖిలేశ్ యాదవ్ తో మాట్లాడారు. ములాయం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ములాయం కోసం దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు చంద్రబాబు ట్విట్టర్ లో తెలిపారు.