రెండో వన్డేలో టీమిండియా టార్గెట్ 279 రన్స్
- రాంచీలో టీమిండియా, దక్షిణాఫ్రికా రెండో వన్డే
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
- అర్ధసెంచరీలు సాధించిన మార్ క్రమ్, హెండ్రిక్స్
- సిరాజ్ కు 3 వికెట్లు
దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా ముందు 279 పరుగుల లక్ష్యం నిలిచింది. రాంచీలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 278 పరుగులు చేసింది. ఐడెన్ మార్ క్రమ్ 79, రీజా హెండ్రిక్స్ 74 పరుగులు చేశారు. క్లాసెన్ 30 పరుగులు చేయగా, మిల్లర్ 35 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
అంతకుముందు, ఓపెనర్లు డికాక్ 5, జానెమన్ మలాన్ 25 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీయగా, సుందర్ 1, షాబాజ్ అహ్మద్ 1, కుల్దీప్ యాదవ్ 1, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ పడగొట్టారు.
అంతకుముందు, ఓపెనర్లు డికాక్ 5, జానెమన్ మలాన్ 25 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీయగా, సుందర్ 1, షాబాజ్ అహ్మద్ 1, కుల్దీప్ యాదవ్ 1, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ పడగొట్టారు.