కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నేతలు

  • మునుగోడులో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • రాజగోపాల్ రెడ్డి క్విడ్ ప్రో కోకు పాల్పడ్డాడన్న టీఆర్ఎస్ నేతలు
  • రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు పనులు తీసుకున్నాడని ఆరోపణ
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు పనులు తీసుకుని బీజేపీలో చేరడం ద్వారా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్విడ్ ప్రొ కోకు పాల్పడ్డారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. 

రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, ఆయనపై అనర్హత వేటు వేయాలని ఈసీని కోరారు. రూ.18 వేల కోట్ల పనులు తీసుకుని, మునుగోడులో ఓట్లు కొంటున్నారని వివరించారు. ఆ రూ.18 వేల కోట్లలో ఈటల రాజేందర్ కు కూడా వాటా ఉందని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. 

మునుగోడులో నవంబరు 3న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా, రాజకీయ విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రతరం అయ్యాయి.


More Telugu News