కాకినాడ జిల్లాలో హత్యకు గురైన యువతి కుటుంబానికి రూ.10 లక్షల సాయం ప్రకటించిన సీఎం జగన్
- కాకినాడ జిల్లాలో దేవిక అనే యువతి హత్య
- నిందితుడు, యువతి ఒకే గ్రామానికి చెందినవారు
- పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఘాతుకం
- ఘటన పట్ల స్పందించిన సీఎం జగన్
- యువతి కుటుంబాన్ని పరామర్శించాలని అధికారులకు ఆదేశాలు
కాకినాడ జిల్లాలో దేవిక (22) అనే యువతి పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు ఆమెను నరికి చంపడం తెలిసిందే. కాండ్రేగుల కూరాడ గ్రామంలో ఈ హత్యోదంతం చోటుచేసుకుంది. దీనిపై స్పందించిన ఏపీ సీఎం జగన్ మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల సాయం ప్రకటించారు. యువతి కుటుంబాన్ని పరామర్శించాలని అధికారులను ఆదేశించారు. వారికి అండగా నిలవాలని సూచించారు.
దేవిక తల్లిదండ్రులు నాగమణి, రాంబాబు హైదరాబాదులో ఉంటుండగా, దేవిక కూరాడ గ్రామంలో తన అమ్మమ్మ చంద్రమ్మ వద్ద ఉంటూ చదువుకుంటోంది. ఆమెను హత్య చేసిన వెంకట సూర్యనారాయణ కూడా కూరాడ గ్రామానికి చెందినవాడే.
కాగా, దేవిక, సూర్యనారాయణ ప్రేమించుకోగా, తల్లిదండ్రులు ఒప్పుకోవడంలేదని దేవిక పెళ్లికి నిరాకరించినట్టు తెలుస్తోంది. దాంతో ఆమెపై కోపం పెంచుకున్న సూర్యనారాయణ... నడిరోడ్డుపై హత్య చేశాడు.