తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
- తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు
- నిండిపోయిన క్యూ కాంప్లెక్స్
- 4 కిలోమీటర్ల మేర క్యూలైన్లు
- శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం
పెరటాసి మాసం సందర్భంగా తమిళనాడు నుంచి వస్తున్న భక్తులతో తిరుమలలో భారీ రద్దీ నెలకొంది. గత కొన్నిరోజులుగా నెలకొన్న భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగింది. ఈ ఉదయానికి క్యూ కాంప్లెక్స్ వెలుపల క్యూలైన్లు కొనసాగుతున్నాయి. నాలుగు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు ఉన్నారు. తిరుమల శ్రీవారి సర్వ దర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది.
కాగా, నిన్న రాత్రి వరకు స్వామివారిని 81,034 మంది దర్శించుకున్నారు. 47,312 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఒక్కరోజే తిరుమల వెంకన్నకు హుండీ ద్వారా రూ.4.24 కోట్ల ఆదాయం లభించింది.