అన్నయ్య కళ్లలోకి చూస్తూ డైలాగ్ చెప్పలేం: సత్యదేవ్
- 'గాడ్ ఫాదర్'లో పేలిన సత్యదేవ్ పాత్ర
- చిరూకి థ్యాంక్స్ చెప్పిన సత్యదేవ్
- మెగాస్టార్ అభిమానిగా చేశానంటూ వ్యాఖ్య
- ఆయన కళ్లలోకి చూస్తూ డైలాగ్ చెప్పలేమంటూ వివరణ
చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'గాడ్ ఫాదర్' సినిమాలో సత్యదేవ్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు. ఈ పాత్ర ఆయనకి మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో సత్యదేవ్ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో అన్నయ్య 'నిన్నెవరు కాపాడతాడ్రా బచ్చా' అనే మాట నన్ను అనడానికి చాలా ఆలోచన చేశారు. అలా అనమని నేను బ్రతిమాలుకోవలసి వచ్చింది.
మెగాస్టార్ ఎన్నో బ్లాక్ బస్టర్లు చూశారు .. అలాంటి ఒక బ్లాక్ బస్టర్ లో నేను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. సత్యదేవ్ చాలా బాగా చేశాడని అంతా అంటున్నారు. కానీ నిజానికి అక్కడ చేసింది మెగాస్టార్ ఫ్యాన్. శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందనే విషయం నాకు 'గాడ్ ఫాదర్' సినిమాతోనే అర్థమైంది. నన్ను నమ్మి అన్నయ్య నాకు ఈ పాత్రను ఇప్పించినందుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.
పూరి గారు షూటింగుకి ముందు నాకు కాల్ చేసి, చిరంజీవిగారి ముందు డైలాగ్ ఎలా చెప్పాలని నన్ను అడిగారు. అన్నయ్య కళ్లలోకి చూడకుండా చెప్పేయండి అన్నాను నేను. ఎందుకంటే అన్నయ్య కళ్లలోకి చూస్తూ డైలాగ్ చెప్పడం చాలా కష్టం. సీనియర్ ఆర్టిస్టులతో కలిసి నటించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.