చిరంజీవి ఇండస్ట్రీని ఏలేస్తాడని నేను ఆ రోజునే చెప్పాను: మురళీ మోహన్
- 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్ లో మురళీ మోహన్
- చిరూతో తన అనుబంధాన్ని గురించిన ప్రస్తావన
- ఆయన కళ్లే హైలైట్ అంటూ కితాబు
- తక్కువ డైలాగ్స్ తో మెప్పించారంటూ ప్రశంసలు
'గాడ్ ఫాదర్' సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లో వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన మురళీ మోహన్ మాట్లాడుతూ .. "ఈ సినిమా మేమందరం అనుకున్నదానికంటే చాలా పెద్ద హిట్ అయింది. సినిమా రిలీజ్ కి ముందు మా అందరికీ కొన్ని అనుమానాలు ఉన్నాయి. హీరోయిన్ లేదు .. డ్యూయెట్లు లేవు .. భారీ డైలాగులు లేవు ఎలా? అనుకున్నాము.
అలాంటి అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ సినిమా పెద్ద హిట్ అయింది. తెలుగు నేటివిటీకి తగినట్టుగా మోహన్ రాజా ఈ సినిమాను చాలా గొప్పగా చేశాడు. చిరంజీవిగారు గతంలో చాలా సినిమాలు చేసినా, ఆ సినిమాలలోని నటనకు .. ఈ సినిమాలోని నటనకు చాలా తేడా ఉంది. చిరంజీవిగారితో నా ప్రయాణం 'మనవూరి పాండవులు' నుంచి కొనసాగుతోంది. ఆ సినిమా సమయంలో ఆయన గురించి నేను .. కృష్ణంరాజు గారు మాట్లాడుకున్నాము.
'చిరంజీవి కళ్లు చూశావా .. రాబోయే రోజుల్లో ఇతను మంచి విలన్ అవుతాడు అని నాతో కృష్ణంరాజు గారు అన్నారు. విలన్ ఏంటి సార్ .. ఆయన ఇండస్ట్రీని ఏలేస్తాడు చూడండి అని నేను అన్నాను. నేను అన్నట్టుగానే జరిగింది. గాడ్ ఫాదర్' విషయానికొస్తే చాలా తక్కువ డైలాగులతో చిరంజీవి మెప్పించడం ఈ సినిమా ప్రత్యేకత. చిరంజీవిగారికి హైలైట్ అయన కళ్లే .. కంటి చూపులతోనే ఈ సినిమాలో ఆయన అద్భుతంగా చేశారు" అంటూ చెప్పుకొచ్చారు.