ఖర్గే, థరూర్ గొప్ప స్థాయి కలిగిన వ్యక్తులు... రిమోట్ కంట్రోల్ నియంత్రణ అంటే వారిని అవమానించినట్టే: రాహుల్ గాంధీ
- త్వరలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు
- బరిలో నిలిచిన ఖర్గే, థరూర్
- ఎవరు గెలిచినా పవర్ సోనియా చేతుల్లోనే అంటూ ప్రచారం
- ఖండించిన రాహుల్
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ పోటీపడుతున్న సంగతి తెలిసిందే. అయితే, వారిలో ఎవరు గెలిచినా వారికి దక్కే అధికారం నామమాత్రమేనని, రిమోట్ కంట్రోల్ సోనియా చేతుల్లోనే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.
మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ ఇద్దరూ గొప్ప స్థాయి కలిగిన నేతలు అని, ఎంతో అవగాహన, తమకంటూ సొంత దృక్పథం ఉన్న నేతలు అని తెలిపారు. వారిని రిమోట్ కంట్రోల్ తో నియంత్రిస్తారు అనడం సరికాదని, అలా అంటే వారిని అవమానించినట్టేనని అన్నారు. అలా ఎన్నటికీ జరగదని, వారిలో ఎవరు గెలిచినా పూర్తి అధికారాలతో పనిచేస్తారని వెల్లడించారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఈ నెల 17న పోలింగ్ జరగనుంది. 19న ఫలితాలు వెల్లడి కానున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల బరిలో ఖర్గే, థరూర్ మాత్రమే మిగిలారు. దాంతో ఎవరు గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.