బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఇంచార్జీల‌కు షాకిచ్చిన సునీల్ బ‌న్స‌ల్‌

  • శుక్ర‌వారం 119 అసెంబ్లీల‌కు ఇంచార్జీల‌ను ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌
  • ఎన్నిక‌ల్లో పార్టీ టికెట్ ద‌క్కినట్టేన‌న్న సంబ‌రాల్లో ఇంచార్జీలు
  • ఇంచార్జీలు ఎన్నిక‌ల్లో పోటీ చేయొద్దంటూ సునీల్ బ‌న్సల్ పిలుపు
  • త‌మ‌ను ప‌ద‌వుల్లో నుంచి త‌ప్పించాలంటున్న ఇంచార్జీలు
తెలంగాణ‌లోని 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జీల‌ను ప్ర‌క‌టిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ శుక్ర‌వారం జాబితా విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీలంటే... ఎన్నిక‌ల్లో దాదాపుగా వారే పార్టీ అభ్య‌ర్థులుగా బ‌రిలోకి దిగుతున్న సంగ‌తి తెలిసిందే. దాదాపుగా అన్ని పార్టీల్లోనూ అదే త‌ర‌హా సంప్ర‌దాయం కొనసాగుతోంది. ఈ క్రమంలో అసెంబ్లీ ఇంచార్జీలుగా ప‌ద‌వులు ద‌క్కిన బీజేపీ నేత‌లు ఎన్నికల్లో త‌మ‌కు టికెట్ ద‌క్కిన‌ట్టేన‌న్న భావ‌న‌తో సంబ‌రాల్లో మునిగిపోయారు.

అయితే అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గాల ఇంచార్జీల జాబితా విడుద‌లైన మ‌రునాడే... ఇంచార్జీలంద‌రికీ బీజేపీ తెలంగాణ ఇంచార్జీగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన సునీల్ బ‌న్సల్ షాకిచ్చారు. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీలుగా ప‌ద‌వులు ద‌క్కిన వారు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌వ‌ద్దంటూ ఆయ‌న ఓ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్య విన్నంత‌నే షాక్‌కు గురైన ఇంచార్జీల్లో చాలా మంది త‌మ‌ను ప‌ద‌వుల నుంచి తొల‌గించాల‌ని బండి సంజయ్‌ను కోరుతూ లేఖ‌లు రాస్తున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.


More Telugu News