పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌లో అక్రమాలపై హర్భజన్ సింగ్ ఫైర్

  • పీసీఏ చీఫ్ గుల్జారీందర్ చాహల్ పై భజ్జీ మండిపాటు
  • అక్రమాలకు పాల్పడితే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరిక
  • స్వప్రయోజనాల కోసం క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఫైర్
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ గుల్జారీందర్ చాహల్ పై టీమిడియా మాజీ ఆటగాడు, ఆప్ రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ మండిపడ్డారు. అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడితే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అక్రమాలకు సంబంధించి గత వారం, పది రోజులుగా పంజాబ్ క్రికెట్ అభిమానులు, స్టేక్ హోల్డర్ల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. 

ఓటింగ్ హక్కులతో దాదాపు 150 మంది సభ్యులను చేర్చుకోవడానికి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ యత్నిస్తోందని... ఇది బీసీసీఐ రాజ్యాంగానికి విరుద్ధమని అన్నారు. అంతేకాదు... పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ మార్గదర్శకాలు, పారదర్శకత ఉల్లంఘన కిందకు కూడా ఇది వస్తుందని చెప్పారు. పీసీఏలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు వారి స్వప్రయోజనాల కోసం క్రీడా స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.


More Telugu News