మీ వాహనానికి బీహెచ్ సిరీస్ తీసుకోవచ్చు!
- ఇప్పటికే రాష్ట్రాల పరిధిలో రిజిస్టర్ అయిన వాహనాలకు అనుమతి
- నిబంధనల్లో సవరణలు ప్రతిపాదించిన కేంద్ర రవాణా శాఖ
- ఒక దరఖాస్తుతో సులభంగా బదిలీ
దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్ పేరుతో, ఆంధప్రదేశ్ అయితే ఏపీ పేరుతో, తమిళనాడులో టీఎన్ పేరుతో వాహన నంబర్ ప్లేట్లపై సిరీస్ మొదలవుతుంది. వీటి మాదిరే బీహెచ్ విధానం కూడా పనిచేస్తుంది. వివిధ రాష్ట్రాల పరిధిలో రిజిస్టర్ అయిన వాహనాలు బీహెచ్ సిరీస్ కు మారిపోయే అవకాశం కూడా రానుంది. నిబంధనలకు సవరణలను ప్రతిపాదిస్తూ కేంద్ర రవాణా శాఖ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివిధ రాష్ట్రాల పరిధిలో ఉద్యోగరీత్యా బదిలీ అయిన సందర్భాల్లో వాహనాల రిజిస్ట్రేషన్ ను కూడా మార్చుకోవడం ప్రస్తుతానికి తప్పనిసరి. వీరిని దృష్టిలో పెట్టుకునే కేంద్ర సర్కారు బీహెచ్ ను తీసుకొచ్చింది. బీహెచ్ కింద రిజిస్టర్ అయిన వాహనాలు దేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లి అక్కడ తిరుగుతున్నా, రిజిస్ట్రషన్ మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం రాష్ట్రాల పరిధిలో రిజిస్టర్ అయిన వాహనాలు నిర్ధేశిత పన్ను చెల్లించడం ద్వారా బీహెచ్ కు మారిపోవచ్చు. ఇకపై బీహెచ్ పరిధిలో వాహన రిజిస్ట్రేషన్ బదిలీలు (విక్రయించినప్పుడు) సులభంగా కానున్నాయి.