తిరుమలలో ఆరు కిలోమీటర్ల మేర భక్తుల క్యూ... క్యూలైన్లలోకి భక్తుల ప్రవేశం నిలిపివేసిన టీటీడీ
- తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు
- శ్రీవారి దర్శనానికి 48 గంటలు
- గోగర్భం రిజర్వాయర్ వరకు క్యూలైన్లు
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం దాదాపు 6 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. నారాయణగిరి నుంచి గోగర్భం రిజర్వాయర్ వరకు క్యూలైన్లు భక్తులతో క్రిక్కిరిసిపోయాయి. క్యూలైన్లు నిదానంగా కదులుతుండగా, స్వామివారి దర్శనానికి 48 గంటల సమయం పడుతుందని అంచనా.
ఈ నేపథ్యంలో, టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (శనివారం) ఉదయం వరకు క్యూలైన్లలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసింది. ఈ సాయంత్రం క్యూలైన్ల వద్దకు వచ్చిన భక్తులను అధికారులు తిప్పి పంపారు. వారు రేపు ఉదయం 6 గంటలకు రావాలని సూచించారు.
దీనిపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. గోగర్భం వద్ద క్యూలైన్లను పరిశీలించిన ఆయన, తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారని, అందుకే రద్దీ పెరిగిందని అన్నారు. రద్దీ వల్ల భక్తులకు అసౌకర్యం కలుగుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు.