ఇక ఆర్టీసీ బ‌స్సుల్లోనూ డిజిట‌ల్ పేమెంట్ల‌తో ప్ర‌యాణం

  • బ‌స్సులో టికెట్‌ను యూపీఐ పేమెంట్ ద్వారా కొనుగోలు చేసే అవ‌కాశం
  • తొలుత విశాఖ నుంచి న‌డిచే 97 స‌ర్వీసుల్లో అందుబాటులోకి 
  • ద‌శ‌ల‌వారీగా అన్ని బ‌స్సుల్లో డిజిట‌ల్ చెల్లింపుల విస్త‌ర‌ణ‌
ప్ర‌యాణికుల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డంలో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) స‌త్తా చాటుతోంది. ద‌స‌రాకు అవ‌స‌ర‌మైన‌న్ని ప్ర‌త్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఆ సంస్థ‌.. వాటిలో గ‌తంలో మాదిరిగా అద‌న‌పు చార్జీల‌ను వ‌సూలు చేయ‌లేదు. తాజాగా ప్ర‌యాణికుల‌కు మ‌రో సుల‌భ‌త‌ర వెసులుబాటును క‌ల్పిస్తూ ఏపీఎస్ఆర్టీసీ శుక్ర‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. బ‌స్సుల్లో డిజిట‌ల్ చెల్లింపుల‌తో టికెట్ల‌ను విక్ర‌యించేందుకు ఆ సంస్థ తీర్మానించింది. 

బ‌స్సులో టికెట్‌కు చెల్లించాల్సిన సొమ్మును ప్ర‌యాణికులు యూపీఐ పేమెంట్ల ద్వారా చెల్లించేలా ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ కొత్త త‌ర‌హా వెసులుబాటును తొలుత విశాఖ నుంచి న‌డిచే 97 స‌ర్వీసుల్లో అందుబాటులోకి తీసుకురానుంది. ద‌ళ‌ల వారీగా అన్ని బ‌స్సుల్లోనూ యూపీఐ చెల్లింపుల‌ను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు ఆ సంస్థ తెలిపింది.


More Telugu News