జగన్ అనుమతిస్తే... మంత్రి పదవికి రాజీనామా చేస్తా: ధర్మాన ప్రసాదరావు
- విశాఖకు రాజధాని వస్తేనే ఉత్తరాంధ్రకు భవిష్యత్తు అన్న ధర్మాన
- శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు తొక్కిపెట్టారని ఆరోపణ
- విశాఖ రాజధానికి అడ్డొచ్చే వారిని రాజకీయంగా చితక్కొట్టాలని పిలుపు
ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ అమరావతి టూ అరసవెల్లి మహా పాదయాత్ర పేరిట రాజధాని రైతులు చేస్తున్న యాత్రపై ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, 3 రాజధానుల ఏర్పాటు దిశగా వైసీసీ సర్కారు చేపడుతున్న చర్యలు... తదితరాలపై ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ అనుమతి ఇస్తే మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వెళ్లిపోవాలన్న ఆలోచన ఉందంటూ ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విశాఖకు రాజధాని వస్తుంటే అడ్డుకోవడం ఏమిటని ధర్మాన ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర పీక కోసేందుకే అమరావతి నుంచి అరసవెల్లికి యాత్రగా వస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. చెన్నై నుంచి కర్నూలు, కర్నూలు నుంచి హైదరాబాద్‌కు రాజధాని వెళితే అడ్డు చెప్పని వారు విశాఖకు రాజధాని వస్తుంటే అడ్డు చెబుతారా? అంటూ ఆయన నిప్పులు చెరిగారు. విశాఖలో రాజధాని ఏర్పాటైతేనే ఉత్తరాంధ్రకు భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ రాజధానికి అడ్డొచ్చే వారిని రాజకీయంగా చితక్కొట్టాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఏపీ రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీని చంద్రబాబు తొక్కిపెట్టారన్నారు. ఈ క్రమంలో ఎవరిని ఆహ్వానించాలి? ఎవరిని తిరస్కరించాలి? అనే దానిపై ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచన చేయాలని ఆయన పిలపునిచ్చారు.