ప్రభాస్ కి కాస్త దూరంగా వెళ్లగానే అంతా నవ్వుకున్నారు: ప్రభాస్ శ్రీను
- నటుడిగా ప్రభాస్ శ్రీనుకి మంచి గుర్తింపు
- ప్రభాస్ తో పరిచయం గురించిన ప్రస్తావన
- ఇండస్ట్రీ తీరుతెన్నులపై ఆసక్తికర వ్యాఖ్యలు
- తనకి ప్లానింగ్ లేదంటూ వెల్లడి
ప్రభాస్ సినిమాల్లోకి రావడానికి ముందు నుంచే అతనితో శ్రీనుకి మంచి స్నేహం ఉండేది. చాలాకాలం పాటు ఆయన ప్రభాస్ కి కేర్ టేకర్ గా కూడా ఉన్నాడు. అందువల్లనే ఆయనను అంతా ప్రభాస్ శ్రీను అని పిలుస్తుంటారు. ప్రభాస్ శ్రీను కూడా నటుడు కావడం .. తన సినిమాలతో తాను బిజీగా ఉండటం జరిగిపోయింది. కామెడీ టచ్ ఉన్న విలనిజంతో నటుడిగా ప్రభాస్ శ్రీను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కూడా.
తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ .. "లైఫ్ లో నేను ఎప్పుడూ ఏదీ ముందుగా ప్లాన్ చేసుకోలేదు. ఆ క్షణంలో అనుకున్నది చేస్తాను .. ఆ క్షణంలో వచ్చిన పాత్రను చేస్తాను. ఫలానా పాత్రను నేను బాగా చేస్తానని భావించిన హరీశ్ శంకర్ వంటి దర్శకులు నన్ను తప్పకుండా తీసుకుంటారు. ప్రకాశ్ రాజ్ గారి తరువాత అంత ఫాస్టుగా డబ్బింగ్ చెప్పేది నేనే అని కూడా హరీశ్ శంకర్ అంటూ ఉంటాడు.
నేను చాలా గొప్పగా చేశానని అనుకున్న చాలా సీన్స్ ఎడిటింగ్ లో లేచిపోయాయి. వాటిని గురించి ఎవరినీ అడగడానికి కూడా లేదు. ప్రభాస్ శ్రీను ప్రభాస్ తో కలిసి విమానాల్లో తిరుగుతుంటే ప్రతివాడు ఇచ్చే గౌరవం వేరే ఉంటుంది. అలాంటి నాకు కేరక్టర్స్ లేక బాధపడుతున్నట్టు ఊహించుకుని వాళ్లు ఫీలైపోతుంటారు. అందుకే ఇండస్ట్రీలో రేపటి రోజు అనే దానిని నేను నమ్మను. ఇక్కడ నాకు తెలిసింది .. తెలిసొచ్చింది ఇదే" అంటూ చెప్పుకొచ్చాడు.