మరో వివాదంతో కమల హాసన్
- చోళుడు హిందువు కాదన్న దర్శకుడు వెట్రిమారన్ వ్యాఖ్యలకు మద్దతు
- చోళుల కాలంలో హిందూ మతం లేదన్న సీనియర్ నటుడు
- విమర్శిస్తున్న బీజేపీ నాయకులు
దక్షిణాది సీనియర్ హీరో కమల హాసన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. రాజ రాజ చోళుడు హిందూ రాజు కాదని జాతీయ అవార్డు గ్రహీత, తమిళ దర్శకుడు వెట్రిమారన్ చేసిన వివాదాస్పద ప్రకటనను ఆయన సమర్థించారు. ఓ కార్యక్రమానికి హాజరైన వెట్రిమారన్ "రాజ రాజా చోళన్ హిందువు కాదు. కానీ వారు (బీజేపీ) మన గుర్తింపును దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్లు ఇప్పటికే తిరువల్లువర్‌కు కాషాయం పులమడానికి ప్రయత్నించారు. మనం దీన్ని ఎప్పటికీ అనుమతించకూడదు" అని పేర్కొన్నారు. రాజరాజ చోళస్ఫూర్తితో కల్పిత నవల ఆధారంగా రూపొందించిన 'పొన్నియిన్ సెల్వన్ 1' చిత్రం విడుదలైన మరుసటి రోజు వెట్రిమారన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజాగా కమల హాసన్ ఇదే భావన ప్రతిధ్వనించే వ్యాఖ్యలు చేశారు. "రాజ రాజ చోళుని కాలంలో హిందూ మతం అనే పేరు లేదు. వైష్ణవం, శైవం, సమానం మాత్రమే ఉన్నాయి. వీటిని సమిష్టిగా ఎలా సూచించాలో తెలియక బ్రిటీషు వాళ్లు హిందూ అనే పదాన్ని ఉపయోగించారు. తుత్తుకుడిని టుటికోరిన్‌గా ఎలా మార్చారో అదే విధంగా హిందూ అనే పదాన్ని వాడారు" అని కమల హాసన్ అభిప్రాయపడ్డారు.
వెట్రిమారన్, కమల హాసన్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రాజ రాజ చోళుడు నిజంగా హిందూ రాజు అని బీజేపీ నేత హెచ్ రాజా పేర్కొన్నారు. "నాకు వెట్రిమారన్‌లాగా చరిత్ర గురించి పెద్దగా అవగాహన లేదు. కానీ రాజ రాజ చోళుడు నిర్మించిన రెండు చర్చిలు, మసీదులను చూపించమనండి. రాజ రాజ చోళుడు తనను తాను శివపాద శేఖరన్ అనేవారు. అలాంటప్పుడు హిందువు కాదా?" అని ప్రశ్నించారు.