ఐఫోన్ 13కు ఆర్డర్ చేస్తే.. ఐఫోన్ 14ను పంపిన ఫ్లిప్ కార్ట్.. అదృష్టవంతుడంటూ నెటిజన్ల కామెంట్స్
- ఆర్డర్ బుక్ చేసిన స్క్రీన్ షాట్, అందుకు ఫోన్ బాక్స్ ఫొటోలు పోస్ట్
- వినియోగదారుల నుంచి అత్యంత విభిన్నంగా కామెంట్లు
- చాలాసార్లు ఫ్లిప్ కార్ట్ తప్పుడు ఉత్పత్తులు పంపడం లేదా అని ప్రశ్నలు
ఈ కామర్స్ వెబ్ సైట్లు విస్తృతంగా వినియోగంలోకి రావడం, పెద్ద సంఖ్యలో ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా ఇస్తుండటంతో చాలా మంది వాటిలో కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఇంట్లో నిత్యం వాడే ఉప్పులు, పప్పులు, నూనెల నుంచి ఫోన్లు, టీవీలు, ఏసీల దాకా అన్నింటినీ ఈ కామర్స్ సైట్లలో కొనుగోలు చేస్తున్నారు. ఒక్కోసారి కంపెనీల ప్యాకింగ్ సెక‌్షన్లలో పొరపాటో, డెలివరీ ఏజెంట్ల ఏమరుపాటుతోనో ఒక వస్తువుకు బదులు మరో వస్తువు రావడమో, ఎలక్ట్రానిక్ వస్తువుల స్థానంలో ఇటుకలు, సబ్బులు పెట్టి ఉండటమో జరుగుతుంది.
స్క్రీన్ షాట్, వచ్చిన ఫోన్ బాక్స్ ఫొటోతో..
కానీ ఓ వినియోగదారుడికి మాత్రం లక్ కలిసి వచ్చింది. ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 13 మోడల్ ను బుక్ చేసిన వ్యక్తికి.. ప్యాకేజీలో ఐఫోన్ 14 వచ్చింది. ట్విట్టర్ లో దీనికి సంబంధించిన ట్వీట్ వైరల్ గా మారింది. అశ్విన్ హెగ్డే అనే యూజర్ దీనికి సంబంధించి.. ఫోన్ బుక్ చేసిన ఆర్డర్ స్క్రీన్ షాట్, ఐఫోన్ 14 అందిన బాక్స్ చిత్రాలను పోస్టు చేశారు. ‘‘నా అనుచరుల్లో ఒకరు ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 13 బుక్ చేస్తే.. దానికి బదులుగా ఐఫోన్ 14 వచ్చింది’’ అని క్యాప్షన్ పెట్టారు. స్క్రీన్ షాట్ ప్రకారం చూస్తే.. సదరు వినియోగదారుడు నీలి రంగులో, 128 జీబీ మెమరీ ఉన్న ఐఫోన్ 13ను బుక్ చేసినట్టు తెలుస్తోంది.
పరస్పరం భిన్నమైన కామెంట్లతో..
ఇటీవల ఫ్లిప్ కార్ట్ లో ల్యాప్ టాప్ బుక్ చేస్తే ఏవో సబ్బులు వచ్చిన ఘటనపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఐఫోన్ 13కు బదులు ఐఫోన్ 14ను పంపడంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక గతంలో ఫ్లిప్ కార్ట్ లో బుక్ చేసిన నాణ్యతలేని వస్తువులు వచ్చినవారు ఇదే అదనుగా విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరేమో ఫ్లిప్ కార్ట్ వంటి భారీ ఈకామర్స్ సంస్థలో అప్పడప్పుడూ చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయని సమర్థిస్తుండటం గమనార్హం.

- ‘ఆయనెవరో చాలా అదృష్టవంతుడు.. కోరిన దానికన్నా పెద్దదే వచ్చింది..’, ‘ఇది వంద శాతం లక్’ అని కొందరు అంటుంటే.. ‘చాలా మందికి తప్పుడు ఉత్పత్తులు పంపిన ఫ్లిప్ కార్ట్ కు అప్పుడప్పుడు ఇలా జరగాల్సిందే’’ అని మరికొందరు పేర్కొంటున్నారు.
- ‘13 అడిగితే 14 పంపారుగానీ.. అది అసలుదేనా, మరి వారెంటీ ఇస్తారా?’ అని కొందరు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
- ‘బాధ్యత గల పౌరుడిగా తను ఆ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ కు తిరిగి పంపాలి. అదే ఆర్డర్ చేసినదాని కంటే తక్కువ స్థాయి ఫోన్ ను పంపితే ఊరుకునేవారా?’ అని కొందరు పేర్కొంటున్నారు.