జగన్ రెడ్డి పేర్ల మార్పు పిచ్చి పరాకాష్టకు చేరుకుంది: నారా లోకేశ్
- మహనీయులను అవమానిస్తూ జగన్ రాక్షసానందం పొందుతున్నారన్న లోకేశ్
- మహారాజా ఆసుపత్రి పేరును మార్చడాన్ని ఖండిస్తున్నామని వ్యాఖ్య
- ఆసుపత్రికి మహారాజా పేరును కొనసాగించాలని డిమాండ్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పేర్ల మార్పు పిచ్చి పరాకాష్టకు చేరుకుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. మహనీయులను అవమానిస్తూ రాక్షసానందం పొందుతున్నారని అన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చి పెద్ద తప్పు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు విజయనగరంలో ఉన్న మహారాజా ప్రభుత్వాసుపత్రి పేరును మార్చి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నగరం నడి బొడ్డున విలువైన భూమిని ఆసుపత్రికి ఇచ్చింది మహారాజా కుటుంబమని... కేంద్ర మంత్రిగా నిధులను కేటాయించి అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేసింది అశోక్ గజపతిరాజు అని చెప్పారు. రాత్రికి రాత్రి మహారాజా పేరును తొలగించారని... దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని... ఆసుపత్రికి మహారాజా పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు.