లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్, ఢిల్లీ, పంజాబ్‌లో మళ్లీ ఈడీ దాడులు
- 35 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్న అధికారులు
- ఈ తెల్లవారుజాము నుంచే నిర్దేశిత ప్రాంతాలకు వెళ్లిన ఈడీ బృందాలు
- డర్టీ పాలిటిక్స్ అంటూ కేంద్రంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేగం పెంచింది. హైదరాబాద్, ఢిల్లీ, పంజాబ్‌లోని ప్రదేశాల్లో శుక్రవారం ఉదయం నుంచి మరోసారి దాడులు చేస్తోంది. ఈ రాష్ట్రాల్లోని మద్యం కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, సరఫరా గొలుసు నెట్‌వర్క్‌లకు సంబంధించిన వారికి చెందిన ప్రాంగణాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈడీ అధికారుల బృందాలు తమ ప్రధాన కార్యాలయం నుంచి ఈ తెల్లవారుజామునే నిర్దేశిత స్థానాలకు బయలుదేరాయి. కాగా, ఈ దాడులపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. వీటిని "డర్టీ పాలిటిక్స్" అని విమర్శించారు.
" మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలను కనుగొనాలన్న ఏకైక లక్ష్యంతో మూడు నెలల నుంచి 500 కంటే ఎక్కువ దాడులు, 300 పైచిలుకు మంది సీబీఐ/ఈడీ అధికారులు 24 గంటలూ పనిచేస్తున్నారు. కానీ, ఇప్పటిదాకా ఏదీ కనుగొనలేకపోయారు. ఎందుకంటే అక్కడ ఏ తప్పూ జరగలేదు. ఇంత మంది అధికారుల సమయాన్ని తమ నీచ రాజకీయాల కోసం వృథా చేస్తున్నారు. ఇలాంటి దేశం ఎలా పురోగమిస్తుంది?" అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.